2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్లో వైఎస్ జగన్ పాదయాత్ర
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఆంధ్రప్రదేశ్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో పాదయాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. తాడేపల్లిలో పర్చూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామం లాంటివని, కార్యకర్తలు ధైర్యంగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు.