నెల్లూరు మేయర్ ఎన్నికల్ లో తెదేపా ఘన విజయం: వైకాపా కంచుకోటలు బద్దలు

రిపోర్టర్: సతీష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల ఫలితాల్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రూప్ కుమార్ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారని ఎన్నికల అధికారులు తెలిపారు. మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు తెదేపా హవా కొనసాగిందని, వైకాపా అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి పోటీ ఇవ్వలేక చతికిలపడ్డారని వారు పేర్కొన్నారు. మొత్తం నాలుగు రౌండ్లలో కౌంటింగ్ ముగిసేసరికి ఎనభై వేల పైచిలుకు ఓట్ల మెజారిటీని కూటమి అభ్యర్థి దక్కించుకున్నారని అధికారులు వెల్లడించారు.