పశ్చిమ గోదావరిలో కలకలం: రూ. 6.40 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
రిపోర్టర్: గోపి
స్థలం: పశ్చిమ గోదావరి
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాద్ వద్ద పోలీసులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో సుమారు ఆరు కోట్ల నలభై లక్షల రూపాయల విలువైన అక్రమ బంగారం పట్టుబడిందని అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి ఎలాంటి సరైన పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న ఈ భారీ బంగారాన్ని సీజ్ చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.