మనసుకు నచ్చి చేసిన సినిమా 'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్': నాగవంశీ
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' చిత్రం ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. కమర్షియల్ లెక్కల కంటే మనసుకు నచ్చి ఈ సినిమా చేశామని, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్ తెలిపింది.