నెల్లూరు జిల్లాలో ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం
రిపోర్టర్: రాజేష్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ప్రయాణ సమయంలో అలసట, నిద్రమత్తుతో డ్రైవింగ్ చేసే వాహనదారులను అప్రమత్తం చేసేందుకు ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా డ్రైవర్లలో నిద్రమత్తును వదిలించి, సురక్షిత ప్రయాణంపై పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తూ ప్రమాణాల అమలుకు చర్యలు తీసుకుంటున్నారు.