రైల్వే కోచ్‌లో సీటు కోసం మహిళ, యువకుడి మధ్య వివాదం
రిపోర్టర్: రాము
స్థలం: మధ్యప్రదేశ్
ఇండోర్-దేవాస్ రైలు జనరల్ కోచ్‌లో సీటు విషయంలో ఒక మహిళ యువకుడిని తీవ్రంగా నిలదీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వృద్ధుడికి సీటు ఇచ్చిన యువకుడి పట్ల ఆ మహిళ అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఆ యువకుడు ఎంతో సంయమనంతో సమాధానం ఇవ్వడం నెటిజన్లను ఆకట్టుకుంది.