జమ్మూకశ్మీర్లో సీఐఎస్ఎఫ్ జవాన్ కాల్పులు నలుగురు మృతి

రిపోర్టర్: శివ స్థలం: Kathua

జమ్మూకశ్మీర్లోని కఠువా జిల్లాలో పవర్ ప్రాజెక్ట్ వద్ద సీఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ అవధేష్ కుమార్ సింగ్ జరిపిన కాల్పుల్లో అసిస్టెంట్ కమాండెంట్ అంకిత్ కుమార్ పాండే సహా నలుగురు సిబ్బంది మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. ఉద్యోగ స్థలానికి చిన్నారిని తీసుకురావాలన్న విషయమై జరిగిన వాగ్వాదమే ఈ ఘాతుకానికి దారితీసిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ నిమిత్తం నిందితుడిని ఏడు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.