హుజూరాబాద్‌లో విషాదం, అనారోగ్యంతో ఆశా కార్యకర్త మృతి
రిపోర్టర్: హరి
స్థలం: హుజూరాబాద్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ పరిధిలోని దమ్మక్కపేట గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త గూడెల్లి శ్రీలత (40) గత రెండు దశాబ్దాలుగా సేవలందిస్తూ, తీవ్రమైన కామెర్ల వ్యాధితో బాధపడుతూ ఆదివారం కన్నుమూశారు. కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన ఆమె మృతితో గ్రామంలో, తోటి వైద్య సిబ్బందిలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. అంత్యక్రియల్లో స్థానికులు, సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు.