'హైదరాబాద్ విమోచన దినోత్సవం': పర్యటన షెడ్యూల్ వెల్లడించిన G Kishan Reddy
రిపోర్టర్: గోపి
స్థలం: Hyderabad
రేపు జరగనున్న హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలకు సంబంధించి తన అధికారిక పర్యటన షెడ్యూల్ను G Kishan Reddy ప్రకటించారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల్లో పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ, లక్డికాపూల్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళి, పరేడ్ గ్రౌండ్స్ వేడుకలతో పాటు పలు అధికారిక కార్యక్రమాల్లో G Kishan Reddy బిజీగా గడపనున్నారు.