హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య: కాలేజీ ఎదుట విద్యార్థుల ఆందోళన

రిపోర్టర్: సతీష్ స్థలం: ఇబ్రహీంపట్నం

ఇబ్రహీంపట్నం పరిధిలోని లా మెంటోరా కళాశాల హాస్టల్ లో మోక్షజ్ఞ అనే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. బుధవారం రాత్రి గదిలో ఉరివేసుకున్న విద్యార్థిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో తోటి విద్యార్థులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.