బిగ్ బాస్ 10 మొదటి కంటెస్టెంట్‌గా జానపద గాయని ఝాన్సీ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Hyderabad

తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 10 సెప్టెంబర్ 6న ఘనంగా ప్రారంభం కానుంది. ‘అగ్నిపరీక్ష’ సీజన్ 2లో తన ప్రతిభతో ఆకట్టుకున్న జానపద గాయని, రైతుబిడ్డ ఝాన్సీ మొదటి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ప్రవేశిస్తోంది. కఠినమైన పోటీని తట్టుకుని మెయిన్ హౌస్ టికెట్ సాధించినందుకు సంతోషం వ్యక్తం చేసిన ఝాన్సీ, ప్రేక్షకుల ఆశీస్సులు తనపై ఉండాలని భావోద్వేగంతో కోరింది.