తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్ల సర్వీసులు
రిపోర్టర్: హరి
స్థలం: తెలంగాణ
దసరా, దీపావళి పండగల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్థం భారత రైల్వే నవంబర్ వరకు దేశవ్యాప్తంగా వంద ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణ మీదుగా చర్లపల్లి–నాగర్‌కోయిల్, చర్లపల్లి–శ్రీకాకుళం, ప్రయాగ్‌రాజ్–తిరునెల్వేలి ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఇప్పటికే కొన్ని రైళ్లకు రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.