పెదబయలులో భారీ చేరికలు: టీడీపీలో వైభవం చాటుకున్న అల్లూరి సీతారామరాజు జిల్లా
రిపోర్టర్: Thrinadh Rudi
స్థలం: పెదబయలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం జముగూడ పంచాయతీలో పదమూడు గ్రామాల నుంచి ఐదు వందల మందికి పైగా ప్రజలు జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి నేతలు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ డొన్ను దొరతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.