కుప్పంలో దాదర్ పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ హాల్ట్‌ను ప్రారంభించిన సీఎం
రిపోర్టర్: విజయ్
స్థలం: Kuppam
కుప్పం రైల్వే స్టేషన్‌లో దాదర్ - పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ అదనపు హాల్ట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కొత్త హాల్ట్ ఏర్పాటుతో కుప్పం ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరినట్లయింది. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులతో సీఎం ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.