ఏపీలో 513 మండలాల్లో కరవు ఛాయలు హై అలర్ట్ ప్రకటించిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: నరేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 513 మండలాల్లో కరవు ఛాయలు అలుముకోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి హై అలర్ట్ ప్రకటించారు. అమరావతిలోని ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో కరవు ముప్పుపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన పాల్గొని, అక్టోబర్ 1న కరవు మండలాలను ప్రకటించాలని ఆదేశించారు. రైతులకు పంటల భరోసా, ప్రజలకు నీటి భద్రత కల్పించేలా ముందస్తు యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని స్పష్టం చేశారు.