టాలీవుడ్ దర్శకుడు ప్రదీప్ మాడుగుల భార్య దీప్తి రెడ్డి బ్రెయిన్ డెడ్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రదీప్ మాడుగుల భార్య మడుగుల దీప్తి రెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ విషాదకర సమయంలో కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి జీవన్‌దాన్ ద్వారా ఆమె అవయవ దానానికి సమ్మతి తెలిపినట్లు విరాట్ ఫౌండేషన్ అధ్యక్షుడు యష్ వీరగోని తెలిపారు. ఆమె తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం ద్వారా నలుగురి ప్రాణాలు నిలవనున్నాయని ఆయన పేర్కొన్నారు.