పాపిరెడ్డిపల్లిలో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని పోటెత్తిన వైఎస్సార్సీపీ శ్రేణులు

రిపోర్టర్: పి రాజేష్ కుమార్ స్థలం: గంగాధర నెల్లూరు

గంగాధరనెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లిలో వైయస్సార్సీపి ఎంపీటీసీ అభ్యర్థి కె రూప కుమార్ రెడ్డి శనివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్థులను కలుస్తూ స్థానిక సమస్యలపై చర్చించారు. సంక్షేమ పథకాలను వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.