ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి ఉపశమనం పొందిన కల్వకుర్తి రైతాంగం

రిపోర్టర్: Anjaneyulu Yadav స్థలం: కల్వకుర్తి

కల్వకుర్తి పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో బుధవారం ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆకాశం మబ్బులతో కమ్ముకుని వర్షం పడింది. ఈనెల 27 వరకు నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షంతో పత్తి, వేరుశనగ, మొక్కజొన్న రైతులకు మేలు జరగనుంది.