పదో తరగతి ఫలితాల మెరుగుదలే లక్ష్యమన్న కలెక్టర్ నాగరాణి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: పశ్చిమ గోదావరి

పశ్చిమ గోదావరి జిల్లాలో పదో తరగతి విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పశ్చిమ గోదావరి కలెక్టర్ నాగరాణి స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేసి విద్యార్థులకు ప్రత్యేక బోధన అందించాలని ఆదేశించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.