కైకలూరులో వైయస్ఆర్ సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహణ

రిపోర్టర్: సురేష్ స్థలం: ఏలూరు / కైకలూరు

ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షులు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి శాసన మండలి సభ్యులు, ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు వంకా రవీంద్రనాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.