స్వాన్సీ సిటీ క్లబ్లో భాగస్వామ్య వాటా కొనుగోలు చేసిన లూకా మోడ్రిచ్
రిపోర్టర్: హరి
స్థలం: స్వాన్సీ
స్వాన్సీ సిటీ ఫుట్‌బాల్ క్లబ్లో ప్రముఖ స్టార్ ఆటగాడు లూకా మోడ్రిచ్ వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. క్లబ్ ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్న తరుణంలో ఆయన మైనారిటీ పెట్టుబడిదారుడిగా, సహ యజమానిగా మారారని యాజమాన్యం తెలిపారు. ఆయన రాకతో క్లబ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని, జట్టు ప్రదర్శన మెరుగుపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రఖ్యాత బలోన్ డి ఆర్ విజేత అయిన ఆయన రాకతో క్లబ్ భవిష్యత్తుపై అంచనాలు భారీగా పెరిగాయని వర్గాలు స్పష్టం చేశాయి.