ఇస్రో ప్రైవేటీకరణ వార్తలను ఖండించిన చైర్మన్ నారాయణన్
రిపోర్టర్: రాము
స్థలం: India
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోను ప్రైవేటీకరిస్తున్నారంటూ వస్తున్న వార్తలను చైర్మన్ వి నారాయణన్ ఖండించారు. అది ప్రభుత్వ సంస్థగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతరిక్ష రంగ విస్తరణకు ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్‌ల భాగస్వామ్యం అవసరమని, అయితే ప్రైవేటీకరణ ఆలోచన లేదని తేల్చిచెప్పారు. ఉద్యోగుల ఆందోళనలను పరిష్కరిస్తామని, రాజీనామాలు సాధారణమేనని ఆయన తెలిపారు.