సర్దార్ 2 ఈవెంట్లో హీరోయిన్‌పై కార్తీ వివాదాస్పద వ్యాఖ్యలు
రిపోర్టర్: రాము
స్థలం: India
సర్దార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ మాళవికా మోహనన్ గ్లామర్ గురించి హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. మోనికా బెల్లూచీ తరహాలో గ్లామరస్ దుస్తులు ఉంటాయా అని తాను అడిగినట్లు కార్తీ సరదాగా చెప్పడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. యాక్షన్ పాత్రలో నటిస్తున్న హీరోయిన్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, బహిరంగ వేదికలపై మాటల విషయంలో బాధ్యతగా ఉండాలని పలువురు విమర్శిస్తున్నారు.