'గూగుల్ క్లౌడ్‌తో శామ్‌సంగ్ గ్యాలరీ సింక్': కొత్త ఫీచర్ అప్‌డేట్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: World
సామ్‌సంగ్ గ్యాలరీ యాప్ త్వరలో మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్‌కు బదులుగా గూగుల్ క్లౌడ్‌తో నేరుగా సింక్ అయ్యే కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. గెలాక్సీ స్టోర్‌లో గ్యాలరీ క్లౌడ్ సింక్ సర్వీస్ కొత్త వెర్షన్ కనిపించగా, ఫొటోలు మరియు వీడియోల బ్యాకప్ కోసం గూగుల్ క్లౌడ్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 30 తర్వాత వన్‌డ్రైవ్ సింక్ ముగియనున్న నేపథ్యంలో, సామ్‌సంగ్ ఈ కొత్త గూగుల్ ఫొటోస్ ఇంటిగ్రేషన్ సేవలను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.