కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు స్ఫూర్తిదాయకమన్న చినుకని మల్లేష్ యాదవ్
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండల కేంద్రంలో స్వర్గీయ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చినుకని మల్లేష్ యాదవ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం బాపూజీ చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని మల్లేష్ యాదవ్ స్పష్టం చేశారు.