పారాలింపిక్స్‌కు మోనా అగర్వాల్ అర్హత సాధించారు

రిపోర్టర్: కృష్ణ స్థలం: India

దక్షిణ కొరియాలో జరుగుతున్న డబ్ల్యూఎస్‌పీఎస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత పారా షూటర్ మోనా అగర్వాల్ రజత పతకం సాధించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్1 విభాగంలో ఆమె ఈ ఘనత సాధించి, 2028 లాస్ ఏంజెల్స్ పారాలింపిక్స్ క్రీడలకు భారత్ తరఫున తొలి కోటా స్థానాన్ని దక్కించుకున్నారు. ఇదే టోర్నమెంట్‌లో మరో షూటర్ అవని లేఖరా కాంస్య పతకం గెలుచుకోవడంతో పాటు భారత్ టీమ్ గోల్డ్ సాధించింది.