తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కలకలం

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో తీవ్ర గందరగోళం మధ్య కేటీఆర్, హరీశ్ రావు సహా 17 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సెషన్ ముగిసే వరకు స్పీకర్ సస్పెండ్ చేశారు. శాంతిభద్రతల అంశంపై వాయిదా తీర్మానం కోరుతూ సభలో ఆందోళన చేపట్టడంతో మంత్రి శ్రీధర్ బాబు సిఫారసు మేరకు ఈ చర్య తీసుకున్నారు. దళిత స్పీకర్ ను అవమానించేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు.