ఎమ్మెల్యే వంశీకృష్ణకు మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించాలి

రిపోర్టర్: dumarla bhaskar senier journalist స్థలం: అచ్చంపేట

అచ్చంపేట ఎమ్మెల్యే, నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణకు రాష్ట్ర మంత్రివర్గంలో తక్షణమే స్థానం కల్పించాలని అచ్చంపేట మున్సిపల్ మాజీ కౌన్సిలర్ అప్ప శివ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.

సుదీర్ఘ కాలం పాటు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి, జిల్లాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వంశీకృష్ణ కీలక పాత్ర పోషించారని, ఆయన చేసిన సేవలను గుర్తించి తగిన గుర్తింపు ఇవ్వాలని ఆయన కోరారు.