మృత్యువుతో పోరాడుతూ రేణిగుంట స్టేషన్ లో హల్చల్ చేస్తున్న యువకుడు

రిపోర్టర్: Alfa News స్థలం: రేణిగుంట

రేణిగుంట రైల్వే స్టేషన్ లో అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి ఉదయం ఐదు గంటల నుంచి ఆత్మహత్య చేసుకుంటానంటూ ప్లాట్ఫాం ఫుట్పాత్ బ్రిడ్జ్ పై వేలాడుతూ తీవ్ర కలకలం రేపాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు హైటెన్షన్ విద్యుత్ లైన్ పవర్ సప్లై నిలిపివేసి ఆ యువకుడిని కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తిరుపతి నుంచి రేణిగుంట మీదుగా చెన్నై, హైదరాబాద్, విజయవాడ వైపు వెళ్ళాల్సిన రైళ్ల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.