స్థానిక సంస్థల ఎన్నికలు: మేయర్ మరియు మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు

రిపోర్టర్: సునీల్ స్థలం: అమరావతి

స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్ మరియు మున్సిపాలిటీల అధ్యక్ష స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లు మరియు 106 మున్సిపాలిటీలకు కేటాయింపులు పూర్తి చేశారు. బుధవారం పురపోరుకు షెడ్యూల్ విడుదల కానున్న తరుణంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.