విజయనగరం జిల్లాలో దారుణం: భార్యపై అనుమానంతో ఏఈని హతమార్చిన భర్త

రిపోర్టర్: రమేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా రాజాంలో ఎలక్ట్రికల్ ఏఈ లలితకుమారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఉద్యోగరీత్యా ఆలస్యంగా ఇంటికి వస్తుందనే అనుమానంతో భార్యను భర్త సీతారామరాజు గొడ్డలితో హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. కొండంపేట ప్రధాన రహదారి సమీపంలో ఈ ఘోరం జరిగినట్లు పేర్కొన్నారు. తొలుత అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ, మృతురాలి ఒంటిపై గాయాలు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఈ నిజాలు వెలుగుచూశాయని అధికారులు స్పష్టం చేశారు.