దసరా కానుకగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో మహిళా సాధికారతలో భాగంగా దసరా పండుగ కానుకగా అర్హులైన మహిళలకు 'ఇందిరమ్మ చీరల'ను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈసారి ప్రత్యేక ఆకర్షణగా 'చిలకపచ్చ' రంగు చీరలను ఎంపిక చేశారు. పంపిణీలో పారదర్శకత కోసం లబ్ధిదారుల ఫొటోలు తీయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 50 శాతం చీరలు జిల్లాలకు చేరగా, పండుగలోపు పంపిణీ పూర్తి చేసేలా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.