ఐక్యతతోనే విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారం సాధ్యం

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

విశ్వబ్రాహ్మణులంతా ఐక్యంగా ఉండి తమ సమస్యలను సాధించుకోవాలని విశ్వబ్రాహ్మణ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల గంగాధర్ పిలుపునిచ్చారు. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని జన్నారం మండల కేంద్రంలోని వాసవినగర్లో వినాయక మండపం వద్ద గురువారం భగవాన్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.