ప్రజాసేవలో అండగా నిలిచిన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిని గెలిపించాలి

రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు స్థలం: తిరుపతి రూరల్

కరోనా కష్టకాలంలోనూ వరద విపత్తులలోనూ నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచిన చెవిరెడ్డి కుటుంబం సేవలు మరువలేనివి. పాతికేళ్లుగా చంద్రగిరి రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్న చెవిరెడ్డి భావోద్వేగాలను కొనసాగిస్తూ తిరుపతి రూరల్ జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచిన హర్షిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చాయి.