భూముల అక్రమాల విచారణకు ప్రత్యేక కమిటీని నియమించిన రేవంత్ సర్కార్
రిపోర్టర్: నరేష్
స్థలం: Hyderabad
తెలంగాణలో భూముల అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ నిమిత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. 22-ఏ నిషేధిత జాబితా అంశంపై ఏర్పాటైన ఈ కమిటీకి ఐఏఎస్ అధికారి శ్రీదేవసేన చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కమిటీ కన్వీనర్‌గా రాజీవ్ గాంధీ హనుమంతు, సభ్యుడిగా జనగామ కలెక్టర్ కొనసాగుతారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవో నంబర్ 134ను జారీ చేసినట్లు తెలుగు స్క్రైబ్ వెల్లడించింది.