అవామీ లీగ్ శ్రేణుల తీరుపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: సతీష్ స్థలం: ఢాకా

దేశంలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని బంగ్లాదేశ్ రాష్ట్ర మంత్రి యాసర్ ఖాన్ చౌదరి హెచ్చరించారు. మాజీ ప్రధాని షేక్ హసీనా జన్మదిన వేడుకలను నిర్వహించిన అవామీ లీగ్ కార్యకర్తల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢాకాలో జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు జాతీయ సోషలిస్ట్ దళ్ కార్యాలయంపై దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.