పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపుల షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపుల షెడ్యూల్ విడుదలైనట్లు మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి చంద్రయ్య వెల్లడించారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు రూ.125, మూడు సబ్జెక్టులకు రూ.110 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అపరాధ రుసుము లేకుండా ఈ నెల 30 నుంచి నవంబర్ 16 వరకు ఫీజు చెల్లించేందుకు తుది గడువు నిర్దేశించారు. ఆలస్య రుసుముతో డిసెంబర్ నెలాఖరు వరకు అవకాశముందని, విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆయన స్పష్టంగా సూచించారు.