విజయవాడ ఉద్యోగుల ధర్నాలో తోపులాట అస్వస్థతకు గురైన లాయర్ రజిని
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయవాడ
విజయవాడ గాంధీనగర్లో సచివాలయ ఉద్యోగులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ఉద్యోగుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన అడ్వకేట్ రజినీ, పోలీసులతో జరిగిన తోపులాటలో ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే స్పందించిన పోలీసులు, తోటి ఉద్యోగులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరసనను మరింత తీవ్రతరం చేస్తున్నారు.