నరాల బలహీనతపై వైద్యుల హెచ్చరిక: పారేసిస్ లక్షణాలు గుర్తిస్తే తక్షణమే వైద్యులను కలవాలి
రిపోర్టర్: సునీల్
స్థలం: Hyderabad
నరాల బలహీనత కారణంగా తలెత్తే పారేసిస్ సమస్యను సాధారణంగా తీసుకోకూడదని ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సురభి చతుర్వేది స్పష్టం చేశారు. చేతుల్లో పట్టు కోల్పోవడం, నడకలో ఇబ్బందులు తదితర ప్రారంభ సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. డయాబెటిస్, విటమిన్ లోపాలు, స్ట్రోక్ వంటి కారణాల వల్ల ఈ ముప్పు పెరుగుతుందని, సకాలంలో చికిత్స అందించకపోతే తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరించారు.