యువతి అనుమానాస్పద మృతి కేసును హత్యగా మార్చిన పోలీసులు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంకన్నపాలెంలో మొదటి సంవత్సరం నర్సింగ్ విద్యార్థిని హరిణి మృతి కలకలం రేపింది. ఇంటి వెనుక విగతజీవిగా పడి ఉన్న ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు కొత్తగూడెం డీఎస్పీ ఎల్ ఆది నారాయణ స్పష్టం చేశారు.