యాదాద్రి భువనగిరిలో పేదల ఇంటి స్థలాల కబ్జా: భారీ అక్రమాల గుట్టురట్టు
రిపోర్టర్: రాజేష్
స్థలం: యాదాద్రి భువనగిరి
యాదాద్రి భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీలో పేదలకు ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాలు కబ్జా కోరల్ లో చిక్కుకున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ల వారీగా ఖాళీగా ఉన్న భూములను కొందరు అక్రమంగా ఆక్రమించి ఒక్కో స్థలాన్ని ఆరు లక్షలకు విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని, కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరపాలని వారు కోరుతున్నారు.