తెనాలిలో తీవ్ర విషాదం: ప్రముఖ వైద్యుడు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి కన్నుమూత

రిపోర్టర్: కృష్ణ స్థలం: గుంటూరు

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి వయసు ఎనభై తొమ్మిదేళ్లు కన్నుమూశారు. ఇవాళ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. తెనాలి మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు ఆయన తన వైద్య వృత్తి ద్వారా ఎనలేని సేవలందించారు. వేల మంది రోగులకు ప్రాణదానం చేసిన ఆయన మృతితో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.