కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు: కొండా సురేఖ స్పష్టం

రిపోర్టర్: గోపి స్థలం: హనుమకొండ

కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వస్తున్నప్పటికీ తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. వరంగల్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాహుల్ గాంధీ తనను గెలిపించారని, పార్టీని వీడి పెద్దలను అవమానించలేనని పేర్కొన్నారు. అకారణంగా మంత్రి పదవి నుంచి తొలగించడం బాధ కలిగించిందని, రాబోయే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి మళ్లీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.