మిలన్ ఒలింపిక్స్ స్పీడ్ స్కేటింగ్‌లో స్వర్ణం సాధించిన ఫ్రాన్సెస్కా లోలోబ్రిగిడా
రిపోర్టర్: మహేష్
స్థలం: Milan
ఇటలీకి చెందిన ప్రముఖ స్పీడ్ స్కేటర్ ఫ్రాన్సెస్కా లోలోబ్రిగిడా మిలన్ కార్టినా వింటర్ ఒలింపిక్స్ 2026లో అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. మహిళల 3,000 మీటర్ల విభాగంలో ఆమె కొత్త ఒలింపిక్స్ రికార్డు సృష్టించారు. తన 35వ పుట్టినరోజు నాడు సొంతగడ్డపై ఈ చారిత్రక విజయం సాధించడం ద్వారా ఇటలీకి ఈ క్రీడల్లో తొలి స్వర్తాన్ని అందించారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె చేసిన ఈ పునరాగమనం క్రీడాలోకం దృష్టిని ఆకర్షించింది.