రామడుగు మండలంలో అధికారుల కళ్లముందే యథేచ్ఛగా సాగుతున్న మట్టి దందా
రిపోర్టర్: రాజేష్
స్థలం: రామడుగు
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని గాయత్రీ పంపుహౌస్ ప్రాంతం నుంచి కొత్తపల్లి మీదుగా కరీంనగర్‌కు మట్టి మాఫియా యథేచ్ఛగా అక్రమ రవాణాకు పాల్పడుతోంది. ప్రభుత్వ నిధులకు గండికొడుతూ కోట్ల రూపాయల సంపదను దోచుకుంటున్నా, అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.