ఆసియా క్రీడల జట్టు నుంచి జావెలిన్ త్రోయర్ అన్నూ రాణి ఔట్
రిపోర్టర్: నరేష్
స్థలం: న్యూఢిల్లీ
అర్హතා ప్రమాణాలు అందుకోలేకపోవడంతో ఆసియా క్రీడల భారత జావెలిన్ త్రో జట్టు నుంచి స్టార్ అథ్లెట్ అన్నూ రాణికి చోటు దక్కలేదు. నిర్ణీత మార్కు కంటే కేవలం 12 సెంటీమీటర్లు వెనుకబడి ఆమె నిరాశపరిచింది. మరోవైపు అథ్లెటిక్స్ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం అర్హత సాధించని ఆటగాళ్లను టోర్నీకి పంపబోమని స్పష్టం చేసింది. కోలుకుంటున్న అథ్లెట్లు ఫిట్నెస్ నిరూపించుకోవాలని సూచించింది.