తిరుమలలో తీవ్ర నీటి కొరత: తొంబై రోజులకు మాత్రమే సరిపడా నిల్వలు

రిపోర్టర్: రాము స్థలం: తిరుమల

తిరుమల పుణ్యక్షేత్రంలో తీవ్ర నీటి సంక్షోభం తలెత్తిందని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. ఎల్ నినో ప్రభావంతో డ్యాముల్లో నీటిమట్టం పడిపోవడంతో కేవలం తొంబై రోజులకు సరిపడే నిల్వలు మాత్రమే ఉన్నాయని వారు తెలిపారు. ఎండల తీవ్రతకు నీరు ఆవిరవుతుండటంతో రోజువారీ సరఫరాను నాలుగు గంటలకు కుదించామని, భక్తులు నీటిని పొదుపుగా వాడుతూ దేవస్థానానికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.