తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జ్‌గా మీనాక్షి నటరాజన్ మార్పు?
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ త్వరలోనే మారనున్నారు. ఉన్నత చదువుల నిమిత్తం ఆమె విదేశాలకు వెళ్లనుండటంతో హైకమాండ్ కొత్త ఇంచార్జ్ నియామకంపై కసరత్తు ప్రారంభించింది. ఈ రేసులో తమిళనాడుకు చెందిన పలువురు ప్రముఖ నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.