పాట్నాలో ప్రమాదకరంగా గంగా నది, అప్రమత్తమైన అధికార యంత్రాంగం
రిపోర్టర్: విజయ్
స్థలం: పాట్నా, బీహార్
పాట్నాలోని గాంధీ ఘాట్ వద్ద గంగా నది నీటి మట్టం ప్రమాద స్థాయిని 1.93 మీటర్లు దాటింది. నది అత్యధిక వరద స్థాయికి చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతాల్లో నిరంతర గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. మరోవైపు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు నామమాత్రంగా ఉన్నాయని ఎంపీ పప్పు యాదవ్ తీవ్రంగా విమర్శించారు. వరద బాధితులకు కనీస వసతులు కూడా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.