మృతదేహాలపై రాజకీయం చేయవద్దు: రాహుల్ గాంధీకి భగవంత్ మాన్ కౌంటర్

రిపోర్టర్: రాము స్థలం: న్యూఢిల్లీ

పంజాబ్‌లో గుల్జార్ సింగ్ ఆత్మహత్యపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్రంగా తిప్పికొట్టారు. మృతదేహాలపై రాజకీయం చేయడం పంజాబీలకు అస్సలు నచ్చదని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల గుర్తింపు ఆధారంగానే నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేశారని, డ్రగ్స్ స్మగ్లర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.